లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్

navdeeps love mouli movie trailer out now

జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరోగా నవదీప్ కు సరైన సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటిస్తుంది. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్‌స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత ఈసినిమాకు సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =