సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటుంది రౌడీహీరో విజయ్ దేవరకొండ క్రేజ్. నిజానికి విజయ్ కు సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతుంది. గత ఏడాది ఖుషి తో అలరించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ స్టార్. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పలు పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేఖో రే దేఖో అంటూ వచ్చే పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేశారు.
ఇంటివాళ్ల కోసం ఎంత భారమైన మోసుకెళ్ళిపోతా..LET IT BE❤️🔥#TheFamilyStar fourth single #DekhoreDekho out now💥https://t.co/yR9w6vaDk4#TheFamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @itsvedhem #AnanthaSriram @TSeries @tseriessouth pic.twitter.com/Vb3b4A1MLQ
— Sri Venkateswara Creations (@SVC_official) April 2, 2024
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























