ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి దేవర టీమ్ ఎన్టీఆర్ ఫొటోను షేర్ చేస్తూ వేవ్స్ ఇన్ గోవా అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కనిపిస్తున్నారు. . ఒక పాట చిత్రీకరణలో భాగంగా టీమ్ గోవా వెళ్లినట్లు తెలుస్తుంది.
Making waves in Goa !! 🌊🎵 #Devara pic.twitter.com/EDnY5DApGk
— Devara (@DevaraMovie) March 22, 2024
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: