గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెమ్ ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. అదే ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్). ఈసినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లే క్యాస్టింగ్ అండ్ క్రూ సెలెక్ట్ చేస్తున్నాడు బుచ్చి బాబు.ఈసినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను ఓ పవర్ ఫుల్ రోల్ కోసం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టెక్నికల్ కూడా సూపర్ స్ట్రాంగ్ టీం ను సెలక్ట్ చేశారు.సంగీతం కోసం టాప్ మ్యూజిషియన్ ఏ ఆర్ రెహమాన్ ను తీసుకోగా కెమెరామెన్ గా రత్నవేలు ను తీసుకున్నారు.ఎడిటర్ గా ఆంటోనీ రూబెన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల ,కాస్ట్యూమ్ డిజైనర్ గా దీపాలి నూర్ అలాగే పాటల కోసం చంద్రబోస్ ,అనంత్ శ్రీరామ్ ,బాలాజీ లను తీసుకోగా స్టంట్ మాస్టర్ గా సుప్రీం సుందర్ ను తీసుకున్నారు.
బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు.టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ సినిమా నిర్మిస్తుంది.మొత్తానికి భారీ తారాగణం అలాగే సాలిడ్ సాంకేతిక బృందంతో బుచ్చి బాబు ఈసినిమాను రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మలుచనున్నాడు.ఈసమ్మర్ లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: