డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన రామ్ 

Ram Announces double ismart New Release Date

ఉస్తాద్ రామ్ ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ను కొత్త గా చూపెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టాడు పూరి.రామ్ లుక్ ,డైలాగ్ డెలివరీ,డ్యాన్స్ వీటికి తోడు మణిశర్మ మ్యూజిక్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.మరి ఈసినిమా కు సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో వుంటాయో చెప్పక్కర్లేదు.నిజానికి డబుల్ ఇస్మార్ట్ ఈ శివరాత్రికే రావల్సివుంది కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదాపడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మేకర్స్ నుండి ఈమద్య కాలంలో అసలు ఈసినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు అయితే తాజాగా  రామ్ మాత్రం డబుల్ ఇస్మార్ట్ ఎప్పుడు రిలీజ్ కానుందో చెప్పేశాడు.నిన్న హైదేరాబద్ లో ఓ ఈవెంట్ కు హాజరైన రామ్,డబుల్ ఇస్మార్ట్ గురించి స్పందిస్తూ ఈజూన్ లో రిలీజ్ ఉంటుందని తెలిపాడు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

అవుట్ ఫుట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని ఇన్సైడ్ టాక్.ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.పూరి జగన్నాథ్ , ఛార్మి నిర్మిస్తున్నారు.ఈసినిమా విజయం అటు పూరికి అలాగే రామ్ కు తప్పనిసరి కానుంది.మరి ఈ కాంబో మరోసారి ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =