ఘనంగా జరిగిన రకుల్ వివాహం

Rakul Preet Singh and Jackky Bhagnani tie the knot in Goa

“కెరటం” మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక రకుల్ బాలీవుడ్ సెలబ్రిటీ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంతి తెలిసిందే కదా. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా రకుల్‌ పెండ్లి జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ – జాకీ భగ్నానీ పెళ్లి జరిగింది. అంతేకాదు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రకుల్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే తను తెలుగులో చివరిగా చేసిన కొండపొలం. ప్రస్తుతం అయితే తెలుగులో ఎలాంటి సినిమా చేయట్లేదు. తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + two =