సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో ఈసినిమా అందుబాటులో ఉంది. ఇక ఓటీటీలో కూడా ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే విచిత్రం ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఈసినిమా తెలుగు వెర్షన్ కంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ కు ఎక్కువ రైస్పాన్స్ వస్తుండటం. నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఛార్ట్స్ లో గుంటూరు కారం వెర్షన్ తెలుగు ఇండియా వైడ్ గా టాప్ 4 లో ట్రెండ్ అవుతూ ఉంటే గుంటూరు కారం హిందీ వెర్షన్ టాప్ 3 లో ఉంది.
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. థమన్ సంగీతం అందించిన ఈసినిమాను..హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: