కల్కి 2898 AD- ఫుల్ స్వింగ్ లో డబ్బింగ్

kalki 2898 ad movie dubbing work on full swing

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి నెల కూడా ముగియడానికి వచ్చేస్తుంది. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో సినిమాను అప్పటిలోపు రెడీ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చాడు ఈసినిమాలో నటిస్తున్న అయాజ్ పాష. తాజాగా తన సోషల్ మీడియాలో కల్కి డబ్బింగ్ వర్క్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అంటూ తను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =