సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Victory Venkatesh's 75th Film Saindhav OTT Platform and Release Date Fixed

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ముందే సైంధవ్ నుంచి రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో సైంధవ్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కి దక్కించుంది. ఈ క్రమంలో సదరు ప్లాట్‌ఫామ్‌ తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సైంధవ్ చిత్రం అమెజాన్ వేదికగా ప్రసారం కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

కాగా ‘సైంధవ్’ మూవీలో వెంకటేష్ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అలాగే కోలీవుడ్‌ స్టార్ హీరో ఆర్యమరో కీలక పాత్రలో కనిపించగా.. బేబీ సారా పాలేకర్‌తో పాటు రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చగా.. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =