ఈ సినిమా కోసం బ్యాండ్‌ కొట్టడం నేర్చుకున్నా, గుండు కొట్టించుకున్నా – సుహాస్‌

Hero Suhas Reveals Interesting Facts About Ambajipeta Marriage Band Movie

టాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ నటుల్లో సుహాస్‌ ఒకరు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. కాగా ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, ఓన్ బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్‌ కటికినేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే రిలీజైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. “గతేడాది ఫిబ్రవరిలో ‘రైటర్‌ పద్మభూషణ్‌’తో విజయం దక్కింది. ఆ సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తూ ఈ ఫిబ్రవరిలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఇక జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజే నాకు కొడుకు పుట్టాడు. ఇవన్నీ చూస్తుంటే ఒక శుభశకునంలా, అంతా మంచే జరుగుతుందనిపిస్తుంది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాను. బ్యాండ్‌ కొట్టడం నేర్చుకోవడంతో పాటు సన్నివేశాల డిమాండ్‌ మేరకు గుండు కూడా కొట్టించుకున్నాను. డైరెక్టర్ దుశ్యంత్‌ రాసిన కథ నన్ను కదిలించింది. ఇంటర్వెల్‌కు ఇరవై నిమిషాల ముందు వరకు చక్కటి కామెడీతో అలరిస్తుంది. ఆ తర్వాత అనూహ్యమైన మలుపులతో ఎమోషనల్‌గా సాగుతుంది. నా పాత్రలో ఇప్పటివరకూ చూడని హై ఎమోషన్స్‌ కనిపిస్తాయి. ఒక్కోసారి కొంతమంది ‘నీ భుజాల మీదే సినిమాను మోస్తున్నావ్‌’ అని అంటుంటారు. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. ఎందుకంటే..? హీరోగా కంటే మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. ఈ సినిమా తర్వాత ‘ప్రసన్న వదనం’, ‘కేబుల్‌ రెడ్డి’, ఇంకా దిల్‌ రాజు గారి బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్నా.” అని హీరో సుహాస్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =