పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’.. ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి తెలుగు రైట్స్

Mythri Movie Makers Gets Telugu Rights of Prithviraj Sukumaran's Aadu Jeevitham

‘సలార్’ ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు ‘ఆడు జీవితం’. ఇంగ్లీష్‌లో ‘గోట్ లైఫ్’ అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మూవీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. పొట్టకూటి కోసం ఎడారి దేశం సౌదీకి వలస వెళ్లిన ఓ ఇమ్మిగ్రెంట్ జీవితం నేపథ్యంలో ఉండనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేరళకు చెందిన నజీబ్ మొహమ్మద్ అనే వ్యక్తి బ్రతుకుదెరువుకోసం సౌదీకి వెళ్లి అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించాడు? బానిస బ్రతుకు నుంచి ఎలా విముక్తి చెందాడు? అనేది ఈ కథలో చూడొచ్చు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో ఒక్కో భాషలో ఒక్కో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దక్కించుకుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆడు జీవితం’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. ‘సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ఆడు జీవితం’ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచని వ్యక్తి యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రయాణమే ఈ కథ. అద్భుతమైన టీమ్ చెప్పిన అద్భుతమైన కథ. ‘ది గోట్ లైఫ్’ ఏప్రిల్ 10న విడుదలవుతోంది” అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.