కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ ను ముందు ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంభవామి యుగేయుగే🔥#BHIMAA will take charge for this MAHA SHIVARATHRI🔱💥
Storming into theatres from March 8th, 2024😍#BHIMAAonMar8th@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @RaviBasrur @KKRadhamohan pic.twitter.com/BpUR5tvb9Y
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) January 29, 2024
కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: