అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ డేట్,టైమ్ ఫిక్స్

ambajipeta marriage band movie trailer release time fixed

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా కూడా ఒకటి. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో కామెడీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఫిబ్రవరి6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే విజయవాడలో మీటి అండ్ గ్రీట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈసినిమా ట్రైలర్ ను జనవరి 24వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. హైద్రాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =