నమ్రతకు మహేష్ స్వీట్ బర్త్ డే విషెస్

Mahesh Babu Birthday Wishes To Namrata

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడంటే ఆ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఇక నేడు నమ్రతా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు సోషల్ మీడియా ద్వాారా ఫ్యాన్స్, సెలబ్రిటీస్, కుటుంబసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. మహేష్ కూడా తన ఇన్ట్సా ద్వారా నమ్రతాకు స్వీట్ బర్త్ డే విషెస్ ను అందించారు. హ్యాపీ బర్త్ డే నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని.. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మ‌హేష్ పోస్ట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆసినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాగా.. ఈసినిమాలో మహేష్ మేకోవర్, స్టైల్, డైలాగ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ఎప్పటినుండో మహేష్ ను ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈసినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =