సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుండే తన మార్క్ ను చూపిస్తూనే.. మీడియాలో హైలెట్ అవుతూ వచ్చిది. మొదల్లో నమ్రతా తన సోషల్ మీడియా ద్వారా సితార క్యూట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుండేది. అప్పుడే ఎంతో మందిని ఫిదా చేసేసింది. ఆ తరువాత ఏకంగా తనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి పలు వీడియోస్ తో అలరించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు తన ఇన్ట్సా లో తను డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మహేష్ హీరోయిన్స్ తో సితార కు స్పెషల్ బాండింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సమంత, తమన్నా, కియారా, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, పూజా హెగ్డే ఇలా మహేష్ హీరోయిన్స్ తో సితారకు స్పెషల్ బాండింగ్ ఉంటుంది. హీరోయిన్లు అందరూ కూడా సితారను చాలా ముద్దు చేసేవారు. ఇక ఇప్పుడు మరోసారి శ్రీలీలతో కూడా సితార క్యూట్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది. గుంటూరు కారం మూవీ సక్సెస్ సెలబ్రేషన్ మహేష్ నివాసంలో జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో దిల్ రాజు, నాగ వంశీ, మీనాక్షి చౌదరి, శ్రీలీలతో పాటు మహేష్ బాబు ఫ్యామిలీ అందరూ కూడా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో సితార, శ్రీలీల పలు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలని సితార తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Perks of having a Super star as a dad! 🌟
Little Princess #SitaraGhattamaneni‘s special bond with heroines from @urstrulyMahesh‘s movies is lovely to see✨@advani_kiara @Samanthaprabhu2 @hegdepooja @tamannaahspeaks @iamRashmika @Rakulpreet @sreeleela14 #TeluguFilmNagar pic.twitter.com/5VSZMBVnQF— Telugu FilmNagar (@telugufilmnagar) January 17, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: