స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంతకాలం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈవిషయాన్ని సూర్య స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. కంగువలో నా లాస్ట్ షాట్ పూర్తి అయ్యింది. మొత్తం మూవీ టీం ఎంతో నమ్మకంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు, మరెన్నో వాటికీ మొదలు. ఈ సినిమాని వెండితెర పై చూడడానికి ఎదురు చూస్తున్నాను. నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన శివకి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
My last shot done for kanguva! An entire unit filled with positivity! It’s a finishing of one and beginning of many..! Thank you dearest @directorsiva and team for all the memories! #Kanguva is huge n special can’t wait for you all to see it on screen! #Family #Missing pic.twitter.com/C7WmX2B2In
— Suriya Sivakumar (@Suriya_offl) January 10, 2024
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: