సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. ఈసెకండ్ పార్ట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు. ఆ వీడియోతో పుష్ప గాడి రూల్ మొదలైందని మరోసారి నిరూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు సుకుమార్ పుట్టిన రోజు. ఈసందర్భంగా సుకుమార్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ ద్వారా సుకుమార్ కు విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే మై జీనియస్ సుక్కూ డార్లింగ్ సుకుమార్ అంటూ తమ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Happy Birthday to My Genius Sukku Darling #Sukumar pic.twitter.com/ni8c0vu8OZ
— Allu Arjun (@alluarjun) January 11, 2024
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. జగపతిబాబు కూడా ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: