తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది సార్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జనవరి 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
U/A certificate #CaptainMiller 😎
KIDS, YOUTH & FAMILIES get ready for the biggest Action Extravaganza #CaptainMillerPongal 🔥🔥
JANUARY 12th,2024 Blasting Theatres Worldwide@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @saregamasouth pic.twitter.com/ox4lg5x21c
— Sathya Jyothi Films (@SathyaJyothi) December 29, 2023
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: