వ్యూహం వంటి సినిమా ఇప్పటివరకూ ప్రపంచంలోనే రాలేదు – రామ్‌గోపాల్ వర్మ

Ram Gopal Varma Sensational Comments in Vyooham Movie Pre Release Event

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇక వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా రామ్‌గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలు మరియు నేతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాను. కానీ వ్యూహం సినిమా నేపథ్యం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు బయటకు ఎలా కనిపిస్తారు, వెనక ఎలాంటి కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు పన్నుతారు అనేది నేను సైకలాజికల్ కోణంలో ఈ సినిమాలో తెరకెక్కించాను. నేను రాజకీయాల్లో లేకున్నా, రాజకీయ నాయకుల సైకాలజీని అర్థం చేసుకుంటాను. కాంటెంపరరీ ఇష్యూస్ ఉన్న వ్యూహం లాంటి మూవీ వరల్డ్ సినిమాలో రాలేదని చెప్పగలను” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లిన వారు చెప్పిన కారణం ఈ సినిమాలో వారిని కించపరుస్తున్నారని. కానీ రోజు లేచిన దగ్గర నుంచి వారు చేస్తున్న పని సీఎం జగన్‌ను కించపరచడం. అనేక మాటలు, ఆరోపణలు, విమర్శలు చేయడం. ఇలాంటివారు తమను కించపరుస్తున్నారని, వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లడం ఏంటి? పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యా. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు చూసి పవన్ మీద అభిమానం పోయింది. నేను వైసీపీ మనిషినని అంటున్నారు. నేనే చెబుతున్నా కదా.. జగన్‌కు ఫేవర్‌గానే వ్యూహం సినిమా ఉంటుంది. డెఫనెట్‍గా ఈ నెల 29న వ్యూహం సినిమా రిలీజ్ చేస్తాం” అని వర్మ స్పష్టం చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =