సలార్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. అరుదైన రికార్డ్ ముంగిట ప్రభాస్

Salaar Prabhas to Create New Record by Collecting Rs. 100 Cr Gross on 1st Day

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటిభాగం ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ నేడు (డిసెంబర్ 22, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఇక సలార్ బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్‌ నుంచి ఆ స్థాయి హిట్ వచ్చిందని సంబరపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ ఒక అరుదైన రికార్డ్ ముంగిట నిలిచాడు. అదేంటంటే.. తొలిరోజు కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం. అయితే ప్రభాస్ ఇంతకుముందు మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు. తొలిసారిగా.. ‘బాహుబలి 2’తో ఫస్ట్ డే రూ.100 కోట్ల గ్రాస్ సాధించి దేశంలో ఆ ఘనత సాధించిన తొలి హీరోగా నిలిచాడు. అనంతరం ‘సాహో’ సినిమాతో మరోసారి తొలిరోజు రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాతో మూడోసారి ఫస్ట్ డే రూ.100 కోట్ల గ్రాస్ సాధించి, ఇప్పటివరకూ మరే హీరోకు సాధ్యంకాని రీతిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా ‘సలార్’ సినిమాతో ఇంకోసారి ఈ ఫీట్ రిపీట్ చేయడానికి సిద్దమయ్యాడు.

కాగా రిలీజ్​కు ముందే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా నార్త్ అమెరికాలో ఒక్క ప్రీమియర్ షోకె 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ క్రమంలో సలార్ ఫస్ట్ డే రూ.100 కోట్ల గ్రాస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక జరిగితే, నాలుగోసారి ప్రభాస్ ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. ఇక సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 19 =