ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- మాస్ బీట్ తో ఓలే ఓలే పాపాయి ఫుల్ సాంగ్ రిలీజ్

Ole Ole Paapaayi full song out from extra ordinary man movie

జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మరో పాటన రిలీజ్ చేశారు. ఓలే ఓలే పాపాయి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే డ్యాన్స్ ప్రోమోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచి మాస్ బీట్ తో నితిన్, శ్రీలీల పవర్ ఫుల్ స్టెప్స్ తో ఈపాట ఆకట్టుకుంటుంది. రామ్ మిర్యాల, ప్రియా హేమెస్ పాడిన ఈపాటకు.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు.

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =