ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం తమ పంథా మార్చుకుంటున్నారు. ఈమధ్య లేడీ ప్రధానమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. కెరీర్ ప్రారంభించిన కొన్నిరోజులు గ్లామర్ రోల్స్ చేసినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ రోల్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథలో బలం ఉంటే హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు చేసినా ఆడియన్స్ అంగీకరిస్తారన్న విషయం నిరూపిస్తున్నారు. మరి ఈమధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ న్యాచురల్ లుక్ తో ఆడియన్స్ ను ఫిదా చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రంగస్థలం సినిమాలో న్యాచురల్ లుక్ లో కనిపించి చాలా చక్కగా నటించి మెప్పించింది. ఇక రష్మిక కూడా ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నా కూడా గ్లామర్ ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి పుష్ప సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి అచ్చమైన పల్లె పిల్లలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ కూడా లంగా ఓణిలో అచ్చమైన తెలుగు పిల్లలా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు జాన్వీకపూర్ కూడా దేవర సినిమాలో న్యాచురల్ లుక్ తోనే రాబోతున్నారు.
మరి వీరిలో మీకు నచ్చిన న్యాచురల్ బ్యూటీ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: