కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతూ దళపతి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ మరోసారి తెలిసేలా చేస్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైన ‘లియో’ సినిమా కళ్ళు చెదిరే వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ మొత్తం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్లు వసూళ్లు సాధించి రూ.600 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తద్వారా కలెక్షన్ల పరంగా దేశంలోని టాప్ 20 సినిమాల్లో చేరింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ రికార్డుపై గురి పెట్టింది. ‘జైలర్’ టోటల్ రన్లో రూ. 605 కోట్లు రాబట్టిన విషయం విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ‘లియో’ కలెక్షన్ల విషయమై చిత్ర నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కాగా ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో విడుదలకు ముందే ‘లియో’పై అభిమానుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా.. జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరించారు.
Fireproof Box Office Records🔥 There’s nothing you can do😁
540+ Crores in just 12 Days 🦁#Leo Worldwide Badass Box Office Sambavam ❤️🔥#LeoIndustryHit#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio… pic.twitter.com/KqGpkhRs91
— Seven Screen Studio (@7screenstudio) October 31, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: