బిగ్ బాస్ 7- కొత్త కెప్టెన్ గా గౌతమ్

bigg boss season 7 telugu goutham krishna new captain of the house

బిగ్ బాస్ 7 లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. బీబీ మారథాన్ పేరుతో హౌస్ మేట్లకు పలు టాస్క్ లను ఇచ్చాడు బిగ్ బాస్. పలు రిజల్ట్ ఏంటో గెస్ చేయాలి అంతే?, డబ్బాలు సెట్ చేయాలంతే? స్టోర్ ఇట్, పోర్ ఇట్? ఎంప్టీ ద కంటైనర్? వేర్ ఇట్ విన్ ఇట్ ? అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్కుల్లో హౌస్ మేట్స్ అందరూ పాల్గొనగా ఫైనల్ గా ప్రియాంక, ప్రశాంత్, శోభా, సందీప్, గౌతమ్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఐదుగురిలో కెప్టెన్ ను ఎంచుకునే ఛాన్స్ ను హౌస్ మేట్స్ కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ మిర్చి చాలా హాట్ అనేే టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ లో కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఎవరికి ఉందో వారి మెడలో మిర్చి దండ వేయాలి. ఎవరికి తక్కువ దండలు పడతాయో వారు కెప్టెన్ అవుతారు. ఈనేపథ్యంలో ఈ టాస్క్ లో ముందుగా అమర్ దీప్ వచ్చి ప్రశాంత్, తేజ ప్రశాంత్ ను, యావర్ శోభాశెట్టిని, భోలే ప్రియాంకను, అశ్విని ప్రియాంకను, రతిక శోభాశెట్టిని, అర్జున్ సందీప్ ను, శివాజీ సందీప్ ను అనర్హులుగా ఎంచుకుంటారు.

అయితే ఈ ప్రక్రియలో శోభా శెట్టి, యావర్ మధ్య పెద్ద గొడవనే జరుగుతుంది. అన్ని గేమ్స్ ఓడిపోయి లాస్ట్ గేమ్ లో గెలిచావని కారణం చెప్పాడు. దీంతో యావర్ పై శోభా ఫైర్ అయింది. మాటల్లో పిచ్చొడు అని కూడా అనేసింది. శోభా అలా అనడంతో ప్రిన్స్ కూడా కోపంతో ఊగిపోయాడు. ఇక టాస్క్ పూర్తయ్యే సరికి గౌతమ్ కు ఎలాంటి మిర్చి దండలు పడకపోవడంతో కెప్టెన్ అవుతాడు.

మరి ఈవారం ఎలిమినేషన్ లోకి ప్రియాంక, శోభ, సందీప్, అమర్ దీప్, భోలే, శివాజీ, గౌతమ్, అశ్విని వచ్చారు. మరి ఈవారం ఎవరు ఇంటికి వెళతారో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =