బిగ్ బాస్ 7-కెప్టెన్సీ కోసం మొదలైన పోరు

bigg boss season 7 telugu contestants fight for captaincy

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆరు వారాలు పూర్తయి ఏడో వారం కూడా పూర్తికావడానికి వచ్చేస్తుంది. ఇక రెండు రోజులు నామినేషన్స్ తో హౌస్ ఫుల్ వేడెక్కిపోగా నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. పైనల్ గా ఈవారం అశ్విని, తేజ, బోలే, ప్రశాంత్, పూజా, అమర్ దీప్, గౌతమ్ నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఈవారం హౌస్ నుండి వెళతారో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బుధవారం ఎపిసోడ్ మొదలైపోయింది. గాయం కారణంగా శివాజీ గత కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఒకసారి చెకప్ కోసం వెళ్లొచ్చాడు కూడా. ఈనేపథ్యంలోనే శివాజీ యావర్ తో నేను ఇక్కడ ఉండలేకపోతున్నా.. నీకోస, ప్రశాంత్ కోసమే ఉంటున్నా అంటూ కంటతడి పెట్టాడు. మరోవైపు గౌతమ్ వాళ్ల అమ్మ రాసిన లెటర్ పట్టుకొని నామీద మాటలు జారుతున్నారు.. నన్ను అవమానిస్తున్నారు.. అన్నింటికి సమాధానం చెబుతాను అంటూ ఎమోషన్ అవుతాడు.

అనంతరం బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లకు రెడీ అయిపోయాడు. దీనిలో ముందుగా ఓ స్పేస్ షిప్ కూలిపోయింది. అందులో ఉన్న గ్రహాంతర వాసులను ఎవరైతే ఎంటర్ టైన్ చేస్తారో వారికి పాయింట్స్ దక్కుతాయి. అందుకు గాను గులాజీ పురం, జిలేబీపురం అంటూ టీమ్ సభ్యులను రెండు గ్రూపులుగా పెట్టగా వారు డిఫరెంట్ గెటప్ లు వేసి అలరించారు. ఈ టాస్క్ తరువాత ఎగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో రెండు గ్రూపుల నుండి నలుగురు వచ్చి ఒక చిన్న బల్లపై గుడ్డును పెట్టి ఒక వైపున నుండి మరో వైపుకు తీసుకెళ్లాలి.

ఇక ఈ గేమ్ లో అశ్విన్, ప్రశాంత్, సందీప్, అర్జున్ జిలేబి పురం నుండి పాల్గొనగా.. అమర్ దీప్, గౌతమ్, తేజ, యావర్ గులాబీపురం నుండి పాల్గొన్నారు. ఈ టాస్క్ లో జిలేబీపురం టీమ్ గెలుస్తుంది. దీంతో బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంకా ఈరెండు రోజుల్లో పలు గేమ్స్ జరగనున్నాయి.. మరి ఈవారం ఎవరు కెప్టెన్సీ ని గెలుచుకుంటారో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =