సాయి ధరమ్ తేజ్ 17 మూవీ- ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్

SDT17 movie pre look released

మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సాయి తేజ్. అందుకే హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో కి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ తరువాత బ్రో సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. 17 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు రేపు ఉదయం అంటే అక్టోబర్ 15వ తేదీన 8 గంటల 55 నిమిషాలకు ఓ పవర్ ఫుల్ ఫస్ట్ హై ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.

కాగా ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, సారిక స్టూడియోస్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు,ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =