సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేేయనున్నారు. ప్రస్తుతం అయితే రిలీజ్ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే ప్రీ టీజర్ ను రిలీజ్ చేసిన సంగంతి తెలిసిందే కదా. ప్రీ టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది టీజర్ కోసం. ఈసినిమా టీజర్ ఎప్పుడు టీజర్ అవుతుందా చూద్దాం అని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
He is elegant ️…
He is Wild…
You will see his rage on September 28th #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnilKapoor #RanbirKapoor @iamRashmika @imvangasandeep @VangaPictures #TeluguFilmNagar pic.twitter.com/mGn43eAMnG— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2023
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి అర్జున్ రెడ్డి సినిమాతో ఇక్కడ.. ఈసినిమా రీమేక్ తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఈసినిమాతో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: