రివ్యూ : బెదురులంక 2012

bedurulanka 2012 telugu review

నటీనటులు : కార్తికేయ,నేహా శెట్టి,అజయ్ ఘోష్,శ్రీకాంత్ అయ్యంగర్
ఎడిటింగ్ : విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి,సాయి ప్రకాష్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : క్లాక్స్
నిర్మాత :రవీంద్ర బెనర్జీ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఎక్స్ 100 తరువాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో  కార్తికేయ.ఇక ఇప్పుడు బెదురులంక 2012 తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు.ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

2012 లో డిసెంబర్ 21న యుగాంతం అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.బెదురులంక అనే ఊరు లో ఈ వార్తలను నిజమని నమ్మేలా చేసి దాన్ని క్యాష్ చేసుకొని చెక్కెయాలని చూస్తారు ఆ ఊరుకి చెందిన భూషణ్ (అజయ్ గోష్ ),బ్రహ్మం( శ్రీకాంత్ అయ్యంగర్) డానియల్ (రామ్ ప్రసాద్ ).ఇక మరో పక్క అదే సమయంలో అదే ఊరికి చెందిన శివ(కార్తికేయ) ఉదోగ్యం మానేసి సొంత ఊరికి వస్తాడు.అంతకుముందే ఆ ఊరి ప్రెసిడెంట్ కూతరు చిత్ర(నేహా శెట్టి) తో ప్రేమలో పడతాడు.అయితే శివ అంటే చిత్ర నాన్న కు ఇష్టంవుండదు. మరి చివరికి ప్రెసిడెంట్ ను మార్చి శివ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? ఇంతకీ భూషణ్, బ్రహ్మం,డానియల్ అనుకున్నది నెరవేరిందా ?అనేది మిగితా కథ.

విశ్లేషణ :

2012 లో యుగాంతం అవుతుందని అనే వార్తలను నమ్మించేలా చేసి బెదురులంక లోని ముగ్గురు వ్యక్తులు ఆ ఊరి ప్రజల దగ్గరనుంచి అందినంత దోచుకోవాలనుకుంటారు.ఇంతకీ వారు అనుకున్నది చేశారా లేదా కథ గా చూస్తే ఇంతే .ఇందులో నుండే దర్శకుడు కామెడీ తోపాటు మంచి మెసేజ్ ను ఇచ్చాడు. మూఢ నమ్మకాలతో మోసపోకుండా రియాల్టీగా నచ్చినట్లు బ్రతకాలి అనే సందేశాన్ని ఇచ్చాడు. దీన్నే ఎంటర్టైనింగ్ గా చెప్పాడు. ఇదే సినిమా సక్సెస్ కు కారణం అని చెప్పొచ్చు.

ఫస్ట్ హాఫ్ లో ఆ ముగ్గురు కలిసి ఊరి ప్రజలను  నమ్మించేందుకు  చేసే ప్రయత్నాలు అందులో పుట్టే కామెడితో  సరదాగా సాగిపోద్ది.మధ్య మధ్యలో న్యూస్ రీడర్ గా జబర్దస్త్ శ్రీను వచ్చి నవ్వించి వెళ్లిపోవడం అలాగే అజయ్ ఘోష్,శ్రీకాంత్ అయ్యంగార్,జబర్దస్త్ రామ్ ప్రసాద్ కామెడీ మెయిన్ హైలైట్.హీరో హీరోయిన్ల మధ్య అనవసరమైన ట్రాక్ లు అలాగే హీరో తో యాక్షన్ ఎపిసోడ్ లు లాంటివి ఏమి ఉండవు.
ఇక సెకండ్ హాఫ్ లో ఇక యుగాంతం రాదులే  అని ప్రజలు రిలాక్స్ అయిపోతున్న సమయంలో ఒక  ట్విస్ట్ ఇవ్వడం దీన్ని అడ్డు పెట్టుకొని శివ తన ప్రేమను గెలిపించుకోవడం తో ముగుస్తుంది.ముఖ్యంగా చివరి 30నిమిషాలు సినిమాను నిలిబెట్టింది.యుగాంతం వస్తుంది అని నమ్మించి అందులో నుండి మంచి ఫన్ ను జెనరేట్ చేశాడు డైరెక్టర్.ఈ సీక్వెన్స్ అంతా హిలేరియస్ గా ఉంటుంది. క్లైమ్యాక్స్ ను కూడా బాగా డీల్ చేశాడు.కాకాపోతే సినిమా కొంచెం స్లో గా సాగిన ఫీల్ కలుగుతుంది అంతకుమించి పెద్దగా కంప్లైంట్స్ ఏమి లేవు.

ఇక నటీనటుల విషయానికి వస్తే  శివ పాత్రలో కార్తికేయ సెట్టిల్డ్ గా  చేశాడు.ఎక్కడా అతి లేకుండా పాత్ర కు తగ్గట్లు నటించాడు. ఆర్ ఎక్స్ 100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ను అందుకేందుకు అతనికి ఇది మంచి ఛాన్స్. చిత్ర పాత్రలో నేహా శెట్టి బాగా చేసింది.ఇక సినిమాకు పిల్లర్లు గా నిలిచాయి అజయ్ గోష్,శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ పాత్రలు.వీరి పాత్రలు సూపర్ గా వర్క్  అవుట్ అయ్యాయి.వీరికి తోడు జబర్దస్త్ శ్రీను,వెన్నెల కిషోర్,సత్య మధ్య మధ్యలో వస్తూ వాళ్ళ డ్యూటీ చేశారు.
టెక్నికల్ గా చూస్తే ఎప్పుడో వచ్చిన పుకార్లను  ఆధారంగా చేసుకొని మంచి కథనంతో కామెడీ తో మెసేజ్ ఇవ్వడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.ఇక మణిశర్మ  సంగీతం డీసెంట్ గా వుంది.సాంగ్స్ అంతగా గుర్తుపెట్టుకొనెలా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కూడా  బాగున్నాయి.

ఓవరాల్ గా బెదురులంక లో కామెడీ  బాగా వర్క్ అవుట్ అయ్యింది. లాజిక్  లు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది.ఓ మంచి ఎంటర్టైనర్ కావాలంటే బెదురులంకను చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + five =