సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.ఒక్క తమిళనాడులోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే జోరు కొనసాగిస్తుంది.జైలర్ నిన్న మరో 50కోట్ల వసూళ్లను దక్కించుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇందులో షేర్ 146కోట్లు.దాంతో దాదాపు 124కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా 4రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి షాక్ ఇచ్చింది.ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ డామినేట్ చేస్తుంది.నిన్న,రెండో రోజు కన్నా ఎక్కువగా రాబట్టింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5కోట్ల షేర్ ను సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది.దాంతో 4రోజుల్లో 32కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 18కోట్లు.కేవలం 12కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను సొంతం చేసుకోనున్నారు.ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, జైలర్ ను తెలుగులో విడుదలచేశాడు.ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం తో జైలర్ ఫుల్ రన్ లో 50కోట్ల గ్రాస్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈరోజు కూడా జైలర్ బుకింగ్స్ అదిరిపోయాయి.రేపు ఎలాగు హాలిడే కాబట్టి భారీ వసూళ్లను దక్కించుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా,విక్రమ్ కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది.రజినీకాంత్ తోపాటు అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: