రానా- దుల్కర్ మల్టీస్టారర్ టైటిల్ రిలీజ్

rana and dulquer salmaan starrer new movie title revealed

ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. అంతేకాదు వేరే ఇండస్ట్రీ హీరోలతో సైతం జతకట్టడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు కాంబినేషన్స్ లో మల్టీస్టారర్లు రాగా ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టి ఆసక్తికరమైన పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రానా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ చాలా అరుదుగా మంచి సినిమా పవర్ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్. సూపర్ టాలెంటెడ్ దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిలిమ్స్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల నేను ఆనందిస్తున్నాను. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్ రివిల్ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్. కాంత ప్రపంచానికి స్వాగతం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈసినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతికి నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.