సినిమాలకు మంచి బజ్ క్రియేట్ చేయడంలో పాటలు కూడా కీ రోల్ ప్లే చేస్తాయన్న సంగతి తెలిసిందే కదా. అందుకే రిలీజ్ కు ముందు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే చాలు సగం హిట్ అయిపోయినట్టే సినిమా. ఇక ప్రేక్షకులను పాట కనెక్ట్ అయితే చాలు సోషల్ మీడియాలో అది ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో అందరికీ బాగా కనెక్ట్ అయిన పాట జైలర్ సినిమాలోని కావాలయ్యా పాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జైలర్. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈసినిమా ఆగష్ట్10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ఆడియో లాంచ్ ను నిన్న చెన్నైలో ఘనంగా నిర్వహించారు.
ఈ ఆడియో లాంచ్ లో తమన్నా మొదటిసారి కావాలయ్యా పాటకు స్టేజ్ మీద స్టెప్పులేసింది. ఇక దీనిపై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమన్నా పోస్ట్ చేసింది. అందరికీ నచ్చిన కావాలయ్యా పాటకు ఆడియన్స్ ముందు డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.. మరో గొప్ప విషయం ఏంటంటే ఆడియన్స్ లలో సూపర్ స్టార్ రజినీ కాంత్ సార్ కూడా ఉండటం.. గూజ్ బంప్స్ మూమెంట్ అంటూ పోస్ట్ లో పేర్కొంది తమన్నా.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: