సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 10వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ఇచ్చిన అప్ డేట్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఫస్ట్ సింగిల్ కావాలయ్యా సాంగ్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో వుంది. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.ఇక ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలసి ఎనర్జిటిక్ గా పాడారు.
కాగా ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: