50 కోట్ల క్లబ్ లో సామజవరగమన

samajavaragamana movie joins in 50 cr club

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సినిమా సామజవరగమన. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే రిలీజ్ అయిన మొదటి రోజే కాస్త తక్కువ కలెక్షన్స్ ను రాబట్టుకున్నాయి. అయితే మొదటి రోజు మంచి టాక్ రావడంతో సెకండ్ డే నుండి కలెక్షన్ల ప్రభంజనం మొదలుపెట్టింది. అలా ఈసినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ నిర్మాతలకు అయితే మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఇప్పుడు ఈసినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =