జైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మేకర్స్

jailer movie makers confirm release date again

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి మొదటి పాట కావాలయ్య అనే పాటను రిలీజ్ చేయగా ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. హుకుం అంటూ వచ్చే ఈపాటను 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఆగష్ట్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫామ్ చేశారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి చిత్రనిర్మాణ సంస్థం తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ముత్తువేల్ పాండియన్ కౌంట్ డౌన్ స్టార్ట్.. జైలర్ ఆగష్ట్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + nine =