పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ క్షణం తిరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకపక్క సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నాడు.. మరోవైపు తన వారాహి యాత్రలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా అందులో బ్రో సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మామా అల్లుడు కలిస చేస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీని పెంచారు. రెండు రోజుల క్రితం పవన్ ఇంకా సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ ఉన్న మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో వింటేజ్ లుక్ లో ఉన్న పవన్ ను చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ఈసినిమాకు సంబంధించి పవన్ అయితే ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేశాడు కూడా. ఇక గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీ అయిపోయాడు. తన వారాహియాత్ర తో బిజీగా ఉన్నాయి. అయితే దొరికిన గ్యాప్ లో తాజాగా తన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు. తాజాగా బ్రో సినిమా టీజర్ డబ్బింగ్ ను కూడా పూర్తి చేశాడు. ఈసినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీజర్ ను రెడీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ డబ్బింగ్ ను పూర్తి చేశాడు పవన్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ పవన్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఈవిషయాన్ని తెలియచేసింది.
A ‘ROAR’ing Energy has added to the SWAG STORM 💥#BroTeaser Dubbing completed ✅
Announcement soon 📣
@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @SVR4446 @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth#BROFromJuly28 pic.twitter.com/iuIBlLxKJe— People Media Factory (@peoplemediafcy) June 28, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: