యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను మంచి ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. ఒకటైం లో వరుస ఫ్లాప్స్ తో సతమతమైన నిఖిల్ ఈమధ్య వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ2, 18 పేజీస్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం అయితే ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసందర్భంగా నేతాజీ మరణం చుట్టూ ఉన్న రాజకీయ కుట్రలను చిత్ర బృందం టచ్ చేసిందా అని నిఖిల్ అడుగగా.. నిజనిజాలకు చాలా వైవిధ్యాలు ఉంటాయని.. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షం వహించకుండా కేవలం వాస్తవాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేశామని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా విషయంలో వచ్చే అభిప్రాయాను మేము ఆడియన్స్ కే వదిలేశామని తెలిపాడు. ఇంకా పాన్ ఇండియా సినిమాలే కొనసాగిస్తారా అని అడుగగా.. యూనివర్శల్ కథలైతే ఇతర భాషల్లో రిలీజ్ అవుతాయి.. ఉదాహరణకు 18 పేజీస్ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాం అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: