ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్

prabhas adipurush movie advance booking open on june 11

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగాా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో వస్తున్న కథ కావడంతో దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తి నెలకొంది. నిజానికి రామాయణం అనేది అందరికీ తెలిసిన కథే. కానీ దానిని ఎంత కొత్తగా.. విజువల్లీ ఎలా చూపిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆదిపురుష్ పై అదే ఆసక్తి.. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్ లతో సినిమాపై అందరికీ ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులు టైమ్ ఉంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ కూడా దానికి తగినట్టే ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కు సంబంధించి మరో అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ హ్యాపీనిచ్చే అప్ డేట్ ఇచ్చారు. రేపటినుండి అంటే జూన్ 11, ఆదివారం నుండి ఈసినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. మరి ఈ టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అయిపోతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భారీ సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కు ముందే పలు ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. సినీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇంకా హనుమంతుడి కోసం అన్నట్టు ప్రతి థియేటర్లలో ఒక సీటు ఖాళీ గా ఉంచుతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణ్ బీర్ ఒక్కడే పేద పిల్లల కోసం 10 వేల టికెట్లను బుక్ చేశాడు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా సంస్థ ఈసినిమా హక్కులు సొంతం చేసుకోగా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − six =