రాహుల్ విజయ్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

rahul vijay new movie first look poster released

గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA 2 పిక్చర్స్ మొదటి నుంచి మంచి విలక్షణమైన స్క్రిప్ట్స్ తో సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. భలే భలే మగాడివోయ్ , ప్రతి రోజూ పండగే , మహానుభావుడు లాంటి ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి సినిమాలను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేజ మర్ని దర్శకత్వం లో రాహుల్ విజయ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. రాహుల్ విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల అయిన పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పోలీస్ డ్రెస్ ధరించిన లుక్ లో కనిపిస్తున్న రాహుల్ విజయ్ ని చూస్తుంటే పెద్ద మిస్టరీ ని ఛేదించే కథలా అనిపిస్తుంది.

ఇంకా ఈసినిమాలో శివాని రాజశేఖర్, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గారి నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 8 గా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. మొత్తానికి మరో కొత్త ఓరియెంటెడ్ చిత్రం తో వస్తుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. ఈసినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − three =