మాసివ్ సెట్‌లో భోళా శంకర్ సాంగ్ షూట్

bholaa shankar movie shooting update

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ‘భోళా శంకర్’. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూాడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే భోళా మేనియా అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మహతి సాగర్ అందించిన డ్యాన్స్ నంబర్‌ను ఎక్స్ ట్రార్డినరిగా చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.