సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎఎస్ఎంబీ28 కోసం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతోో ఈసినిమాపై ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ అప్ డేట్ తప్పా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ కూడా కొత్త అప్ డేట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు తాజా అప్ డేట్ వచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే31వ తేదీన రిలీజ్ చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను మే 31వ తేదీనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరిన్న అప్ డేట్ల కోసం ఎదురుచూడండి అంటూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A Smashing 𝐌𝐀𝐒𝐒 Euphoria is all set to begin!! 🤩#SSMB28 Title will be revealed by all of you, SUPER FANS at 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒 near you on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘 in a Never before way! 🔥
Stay tuned for more exciting updates 😎
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja… pic.twitter.com/m0u41bGfGn
— Haarika & Hassine Creations (@haarikahassine) May 26, 2023
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.