కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాడు డైరెక్టర్ కార్తీక్ దండు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ఈసినిమా స్క్రిప్ట్ లో సుకుమార్ ఒక కీలక మార్పు చేశాడని చెప్పాడు. నిజానికి రాసుకున్న కథ ప్రకారం యాంకర్ శ్యామల నెగటివ్ పాత్ర చేయాల్సి ఉంది. అయితే స్క్రీన్ ప్లే ను మార్చి, చివరకు సంయుక్త మీనన్ ను విలన్ గా చేసింది సుకుమార్ అంటూ ముఖ్యమైన విషయం తెలియచేశాడు. మరి సుకుమార్ ఆ పాయింట్ ను మార్చడమే ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. చివరి వరకూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. చావులకు కారణం ఎవరో అనే విషయాన్ని చెప్పకుండా చివరి వరకూ సస్పెన్స్ ను కొనసాగించడం ఈసినిమాకు కలిసొచ్చిన అంశం.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా తన నటనకు గాను ప్రశంసలు దక్కాయి. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఇంకా శామ్ దత్ సినిమాటోగ్రఫి ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: