పెద్ద బ్యానర్ సమర్పణలో హిడింబ- త్వరలో ట్రైలర్

ashwin babus hidimba movie trailer update

ప్రముఖ యాంకర్, ఫిల్మ్ మేకర్ ఓంకార్ గా తమ్మడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలపోయాడు అశ్విన్. ప్రస్తుతం మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. భారతీయ సినీ చరిత్రలో రాని జోనర్ లో ఈసినిమా రాబోతుందని.. త్వరలో ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని.. ట్రైలర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారని తెలియచేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ashwin babu (@actorashwin)

కాగా నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twelve =