లోకేష్ తో రజనీ చివరి సినిమా?

rajinikanth last movie with lokesh kanagaraj

సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా 170వ చిత్రం, TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఇంకా కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్‌లో పవర్ ప్యాక్డ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. అయితే రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ తన చివరి సినిమా ఇదే అంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఆ వార్త తెరపైకి వచ్చింది. లోకేష్ కనకరాజ్ తో రజనీ 171 సినిమా చేస్తాడని.. అదే తనకి చివరి సినిమా అంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఓ డైరెక్టర్ నోటి నుండి ఆవ్యాఖ్యలు రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. లోకేష్ దర్శకత్వంలో విజయ్ హీరోగా లియో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ మిస్కిన్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్కిన్.. రజనీ తన 171 వ సినిమాను లోకేష్ తోనే చేయొచ్చని అంతేకాదు ఇది తన చివరి సినిమా కూడా అవ్వొచ్చి తెలిపాడు. రజనీనే స్వయంగా లోకేష్ ను పిలిపించి ఈ సినిమాను డైరెక్ట్ చేయమని చెప్పినట్టు కూడా తెలిపాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + fourteen =