యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన కస్టడీ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.గత కొద్దీ రోజలనుండి సినిమాను అన్ని తానై ప్రమోట్ చేస్తున్నాడు చైతన్య.సినిమా విజయంపై కూడా సూపర్ కాన్ఫిడెంట్ వున్నాడు.ఇక మీడియా ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ను రివీల్ చేశాడు నాగ చైతన్య. కస్టడీ లో విలన్ ను ప్రాణాలతో కాపాడుకోవడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు అది ఎందుకు అనేదది ఆసక్తిగా ఉంటుందని తెలిపాడు అలాగే నాగార్జున,అఖిల్ నటించిన గోస్ట్,ఏజెంట్ సినిమాలపై కూడా స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు..కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం అభిమానులకు ఎప్పుడు మంచి సినిమాల ఇవ్వాలనేది మా ఉద్దేశం.ఈసారి స్ట్రాంగ్ గా కం బ్యాక్ అవుతాము.కస్టడీ మాత్రం ఎక్కడా డిస్పాయింట్ చేయదు అని వ్యాఖ్యానించాడు.మొత్తానికి ఈసారి పర్ఫెక్ట్ మూవీ తో నాగ చైతన్య బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు.ఇక రేపు ఈసినిమా ట్రైలర్ కూడా విడుదలకానుంది.
గ్యాంబ్లర్ ఫేమ్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈసినిమా ఈనెల 12న తెలుగు తోపాటు తమిళం లో కూడా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: