పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈసినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్రయూనిట్ రిలీజ్ ను వాయిదా వేసింది. ఫైనల్లీ ఈసినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రమోషన్ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు అప్ డేట్స్ మాత్రమే వస్తున్నాయి. రెగ్యులర్ అప్ డేట్స్ మాత్రం ఇవ్వడంలేదు. అయితే రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మే 9న ట్రైలర్ను కూడా లాంచ్ చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి మాత్రం రిలీజ్ డేట్ ను మార్చే ప్రసక్తే లేదంటున్నారు. రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని అంటున్నారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: