మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చి మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. థ్రిల్లర్ సినిమాలు అంటే మనవాళ్లు ఎప్పుడూ ఫేవరేటే. అది మరోసారి ఈసినిమాతో రుజువైంది. మిస్టరీ హారర్ర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 44కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు హిట్ సినిమాలకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమా చివరిలో అందుకు సంబంధించిన హింట్ లు కూడా ఇస్తున్నారు. ఇక ఈసినిమాకు కూడా పార్ట్ 2 ఉంటుందని అంటున్నాడు సాయి థరమ్ తేజ్. ఈసినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ను నిర్వహించాడు తేజ్. ఈనేపథ్యంలో ఓ అభిమాని మూవీ చివరిలో చిన్న హింట్ ఇచ్చారు.. పార్ట్ 2 ఉంటుందా అన్నా.. ఒకవేళ పార్ట్2 ఉంటే మన ఫ్యాన్స్ కు పండుగ అన్న అంటూ పోస్ట్ చేయగా దానికి తేజ్ ఉంటుందనే కదా హింట్ ఇచ్చాము అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో పార్ట్ 2 పై క్లారిటీ వచ్చేసినట్టే. మరి ఎప్పుడు మొదలుపెడతారో చూాడాలి.
Undhi ane kadha hint ichamu 😊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 24, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: