మంగళవారం- నెవర్ బిఫోర్ రోల్ లో పాయల్

payal rajput poster released from mangalavaaram movie

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో చూశాం. మొదటి సినిమాతోనే ముగ్గురికీ ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంగళవారం. ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు పాయల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ను చూస్తుంటే మాత్రం పాయల్ ను ఈసారి కూడా అజయ్ మరో డిఫరెంట్ రోల్ చూపించబోతున్నాడన్న విషయం అర్థమవుతుంది. ఈసినిమాలో పాయల్ శైలజ అనే పాత్రలో నటిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో పాయల్ న్యూడ్ గా ఉండి వెనక్కు తిరిగి చూస్తుంది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కాగా గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 7 =