కట్టప్ప పాత్ర అందుకే వదులుకున్నా

sanjay dutt about kattappana role in bahubali series

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2. ఈసిరీస్ కోసం దాదాపు 5ఏళ్లు తీసుకున్నాడు రాజమౌళి. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ముందుగా ఎంతోమంది నటీనటులను సంప్రదించగా చాలామంది నటీనటులు ఆయా పాత్రలను వదులుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా తాను కట్టప్ప పాత్రను ఎందుకు వదులుకున్నానో చెబుతున్నాడు సంజయ్ దత్. కట్టప్ప క్యారెక్టర్‌ కోసం మొదట సంజయ్‌ దత్‌ను సంప్రదించారట దర్శకుడు రాజమౌళి. అయితే స్క్రిప్ట్‌ విన్న సంజయ్‌ దత్‌.. కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి అవకాశాన్ని వదులుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ దత్‌ వెల్లడించారు. మరి సంజయ్ దత్ వదులుకోవడంతో ఆ పాత్ర సత్యరాజ్ కు దక్కింది. మరి సత్యరాజ్ కు ఈపాత్ర ద్వారా ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి మరో మెట్టు ఎక్కారు. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేశారు. ఈసినిమా ఆస్కార్ అవార్డును సైతం దక్కించుకుంది. రాజమౌళి తన తరువాత సినిమాను మహేష్ తో చేయనున్నారు. ప్రస్తుతం ఈసినిమా కథను తయారు చేసే పనిలో ఉన్నారు. అడ్వంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే తెలిపారు. చూద్దాం ఈసినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో .

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =