లక్కీ ఛామ్ గా సంయుక్తా మీనన్

samyuktha menon turned as Lucky Charm Of Tollywood

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఒక లెక్క అయితే.. ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమాలు హిట్ అయితే ఓకే ఒకవేళ ఫ్లాప్స్ అయితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. ఎంతోమంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నవారు ఉన్నారు. ప్రస్తుతం అయతే టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోయిన్లు తమ హవాను చాటుతున్నారు. అందులో చాపకింద నీరులా అన్న సామెత ప్రకారం హిట్లను అందుకుంటూ లక్కీ ఛామ్ గా పేరుతెచ్చుకుంది. ఆహీరోయిన్ ఎవరో కాదు సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకొని సంయక్త మీనన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త మీనన్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. రానా దగ్గుబాటి భార్య పాత్రలో నటించిన సంయుక్త నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. అంతేకాదు ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో కూడా చూశాం.

* ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో కూడా సంయుక్త మీనన్ నటించింది. ఈసినిమాలో సంయుక్త మీనన్ పాత్ర కాస్త తక్కువే.. అయితే ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను సైతం అందించంది.

* తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన స్ట్రైయిట్ తెలుగు సినిమా సార్. ఈసినిమా ఈ ఏడాదే రిలీజ్ అయింది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరిగే మోసాల గురించి ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈసినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ అనే పాట ఎంతలా ఆకట్టుకుందో చూశాం.

* ఇప్పుడు విరూపాక్షతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా రిలీజ్ కు ముందు నుండే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన తరువాత కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈసినిమా 44 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమాలో కూడా సంయుక్త మీనన్ కు మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. తన ప్రతిభను చూపించుకునే అవకాశం ఈసినిమాతో దక్కింది.

ఇక తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు అన్నీ హిట్ కొట్టడంతో ప్రస్తుతం సంయుక్తా మీనన్ లక్కీ ఛామ్ గా మారింది. మరి దీంతో సంయుక్త కు వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − one =