పుష్ప రూలింగ్ మొదలు- రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్

record views for pushpa 2 movie glimpse video

అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. దాంతో పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇచ్చిన సంగతి విదితమే. వేర్ ఈజ్ పుష్ప అనే టైటిల్ తో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఆ గ్లింప్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈనేపథ్యంలో అన్ని భాషల్లోనూ మంచి వ్యూస్ ను రాబట్టుకుంటూ నెంబర్ వన్ లో ట్రెండింగ్ అవుతుంది. దీంతో ఈ గ్లింప్స్ వీడియో కి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ 75 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 2.96 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈనేపథ్యంలో మేకర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =